దుబాయ్, అబుధాబిలో వర్షాలు.. చల్లబడిన వాతావరణం

- December 11, 2022 , by Maagulf
దుబాయ్, అబుధాబిలో వర్షాలు.. చల్లబడిన వాతావరణం

యూఏఈ: జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అబుధాబి,  దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎమిరేట్స్ అంతటా వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వీడియోలను వాతావరణ కేంద్ర తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది.  మరోవైపు వర్షాలు పడే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అబుధాబి పోలీసులు వాహనదారులకు సూచించారు. డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలని, వారి వాహనాలకు.. వారి ముందు ఉన్నవారికి మధ్య తగినంత ఖాళీని ఉంచాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com