అజ్మాన్‌లో వంతెనపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు
- December 12, 2022
యూఏఈ: షేక్ ఖలీఫా వంతెనపై ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. వంతెన పైనుండి దూకుతానని ఓ ఆసియా జాతీయుడు బెదిరించినట్లు ఆపరేషన్ గదికి సమాచారం అందిందని అజ్మాన్ పోలీస్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి తెలిపారు. వెంటనే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, పెట్రోలింగ్ పోలీసులు రెస్క్యూ సంఘటన ప్రదేశానికి చేరుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సదరు వ్యక్తితో మాట్లాడి అతడు వంతెనపై నుంచి దూకకుండా నిలువరించినట్లు తెలిపారు. వ్యూహాంలో భాగంగా ఓ వంతెన చివరిలో కూర్చున్న వ్యక్తితో ఓ అధికారి మాట్లాడుతుండగా.. మరో అధికారి సదరు వ్యక్తిని పట్టుకున్నానాడని, మరో ఇద్దరు అధికారులు వారికి సహకరించి అతడిని లాగేశారని వెల్లడించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ ఆ యువకుడిని హమీదియా పోలీస్ స్టేషన్‌కు తరలించిదని తెలిపారు. ఆ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. అతని అప్పు తీర్చడానికి, అతని ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి అతని కేసు కమ్యూనిటీ పోలీసులకు రిఫర్ చేసినట్లు అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి వెల్లడించారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్