కువైట్‌లో బంగారు విక్రయాలకు కొత్త హాల్‌మార్క్

- December 13, 2022 , by Maagulf
కువైట్‌లో బంగారు విక్రయాలకు కొత్త హాల్‌మార్క్

కువైట్: కువైట్‌లోని అన్ని బంగారు దుకాణాలు తమ విక్రయాలకు కొత్త హాల్ మార్కును ప్రవేశపెట్టినట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని బంగారం దుకాణాలు బంగారు ఆభరణాల కోసం కొత్త స్టాంపును పొందాలని ఆదేశించింది. 2023 జనవరి 1 నుండి బంగారు దుకాణాలు పాత హాల్‌మార్క్ ముద్రలతో బంగారు ఆభరణాలను విక్రయించడానికి లేదా ప్రదర్శించడానికి అనుమతించబడవని స్పష్టం చేసింది. పాత స్టాంప్ ఉన్న వస్తువులన్నీ ఉపయోగించిన వస్తువుగా పరిగణించబడతాయని, వాటిని తప్పనిసరిగా ఉపయోగించిన వస్తువుగా విక్రయించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఈ నిర్ణయం వినియోగదారుల వద్ద ఉన్న బంగారానికి వర్తించదని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com