ధోఫర్‌లోని 13 హోటళ్ల పై కేసులు నమోదు

- December 16, 2022 , by Maagulf
ధోఫర్‌లోని 13 హోటళ్ల పై కేసులు నమోదు

మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నందుకు 13 సంస్థలకు నోటీసులు జారీ చేసినటట్లు హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ(MHT) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్‌లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, దాంతో 13 సంస్థలపై దాడులు చేసి నోలీసులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. టూరిజం చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను నివారించడానికి షరతులు నెరవేరే వరకు ప్రాక్టీస్ కార్యకలాపాలను ఆపివేయాలని సదరు సంస్థలను ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ నోటీసుల్లో పేర్కొంది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com