కాటన్‌ కాండీ అమ్మినందుకు వలసదారుడి అరెస్ట్‌

- April 26, 2016 , by Maagulf
కాటన్‌ కాండీ అమ్మినందుకు వలసదారుడి అరెస్ట్‌

 సలాహ్‌లోని న్యాయస్థానం, ఆసియాకి చెందిన ఓ వలసదారుడికి 15 నెలల జైలు శిక్ష, 2,400 ఒమన్‌ రియాల్స్‌ ఫైన్‌ని విధించింది. లైసెన్స్‌లేని కాటన్‌ కాండీ ఫ్యాక్టరీని నడుపుతున్నందుకు న్యాయస్థానం ఆ వలసదారుడికి శిక్ష విధించింది. శిక్షాకాలం పూర్తయ్యాక, నిందితుడిని దేశం నుంచి బయటకు పంపివేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఓ ఇంటిని ఫ్యాక్టరీగా మలిచి, అక్కడే కాటన్‌ క్యాండీలను తయారు చేయడం, వాటిని మార్కెట్‌లో విక్రయించడం ఆ నిందితుడు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటిని తింటే పిల్లలకు తీవ్రమైన అనారోగ్యం సంభవించే అవకాశం ఉందని, కాటన్‌ క్యాండీ తయారీలో పరిశుభ్రత పాటించలేదనీ, మెషినరీ చాలా డర్టీగా ఉందని వారు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com