కొత్త గృహ కార్మికుల చట్టం: గోల్డెన్ వీసా హోల్డర్లకు బంపరాఫర్
- December 17, 2022
యూఏఈ: యూఏఈ కొత్త గృహ కార్మికుల చట్టం డిసెంబర్ 15 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం నుండి లైసెన్స్‌లు పొందిన ఏజెన్సీలకు పనిమనిషి, నానీల నియామకాన్ని పరిమితం చేశారు. అయినప్పటికీ, కొంతమంది నివాసితులు తమ స్పాన్సర్షిప్ క్రింద గృహ సహాయకులను నియమించుకోవడానికి గోల్డెన్ వీసాలు ఉన్నవారికి అనుమతించారు. కొత్త నిబంధనల కింద గోల్డెన్ వీసా హోల్డర్లు "అపరిమిత సంఖ్యలో గృహ సహాయకులను" స్పాన్సర్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్మికులలో గృహిణులు, వంట చేసేవారు, నానీలు, బేబీ సిట్టర్లు, తోటమాలి, కుటుంబ డ్రైవర్లు, వ్యవసాయ కార్మికులు, ప్రైవేట్ ట్యూటర్లు, ప్రైవేట్ నర్సులు, వ్యక్తిగత శిక్షకులు, వ్యక్తిగత సహాయకులు, గార్డులు తదితరులు ఉన్నారు. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
కొత్త చట్టం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గృహ కార్మికుడిని నియమించడం లేదా ఉద్యోగం చేయించడం నిషేధించబడింది. యజమానులు కార్మికులకు ఠంచనుగా జీతాలు చెల్లించాలి. వారానికి ఒక రోజు చెల్లింపు విశ్రాంతి, రోజుకు 12 గంటల విశ్రాంతిని కల్పించాలి. ఆరోగ్య బీమా, ప్రతి రెండు సంవత్సరాలకు వారి స్వదేశానికి రౌండ్‌ట్రిప్ టిక్కెట్, మంచి భోజనం, వసతి కల్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







