నిర్మాణంలో జాప్యం..BD50,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
- December 18, 2022
బహ్రెయిన్: కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన ఏడాదిన్నర అయినా విల్లా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయని నిర్మాణ సంస్థకు బహ్రెయిన్ కోర్టు మొట్టికాయలు వేసింది. క్లయింట్‌కు BD50,000 పరిహారం చెల్లించాలని కంపెనీని ఆరవ హై సివిల్ కోర్ట్ ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 2020లో BD125,400 విలువ చేసే ప్రాజెక్ట్ కోసం ఓ వ్యక్తి BD44,819 చెల్లించాడు. డబ్బులు చెల్లించి 18 నెలలు అయినా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగి తనకు భారీగా నష్టం వచ్చిందని పిటిషన్ దారుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నియమించిన ఇంజినీరింగ్ నిపుణుడు నిర్మాణంలో ఏర్పడిన జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని దాంతో విల్లా కొన్న వ్యక్తికి నష్టం జరిగిందని కోర్టుకు నివేదికను సమర్పించారు. నిపుణుల నివేదికను ఉటంకిస్తూ, పూర్తయిన పనిలో నిర్మాణ సంస్థ అనేక లోపాలు, లోటుపాట్లను చేసిందని కోర్టు పేర్కొంది. విల్లా కొనుగోలు ఒప్పందంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎటువంటి వ్యవధిని పేర్కొనలేదని, అయితే సాధారణంగా మూడు నుంచి 12 నెలల సాధారణ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







