యూఏఈ కొత్త గృహ కార్మికుల చట్టం.. ఉల్లంఘనలకు భారీ జరిమానాలు

- December 18, 2022 , by Maagulf
యూఏఈ కొత్త గృహ కార్మికుల చట్టం.. ఉల్లంఘనలకు భారీ జరిమానాలు

యూఏఈ: ఇటీవల ప్రవేశపెట్టిన గృహ కార్మికుల చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుశిక్షతో పాటు 10 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా విధించబడుతుంది. ఇంటి పనిమనిషి, గార్డు, ఫాల్కన్ కేర్‌టేకర్, హౌస్‌కీపర్, కుక్, నానీ, తోటమాలి, డ్రైవర్, ప్రైవేట్ నర్సు కుటుంబంతో సహా గృహ కార్మికుల నియామకం, ఉపాధి కోసం కొత్త చట్టాన్ని యూఏఈ రూపొందించింది. కార్మిక సంబంధాలను బలోపేతం చేయడానికి, నియంత్రించడానికి సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ను  కొత్త చట్టం ఏర్పాటు చేస్తుందని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

డిక్రీ-చట్టంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై Dh5,000, Dh1 మిలియన్ల వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉల్లంఘనలోని కార్మికుల సంఖ్య ఆధారంగా జరిమానాలు గరిష్టంగా 10 మిలియన్ దిర్హామ్‌లకు వరకు విధించబడతాయి.

ముఖ్యమైన జరిమానాల జాబితా

- లైసెన్సు పొందకుండా ఏ విధమైన మధ్యవర్తిత్వం లేదా గృహ కార్మికులను తాత్కాలికంగా నియమించడం కోసం Dh200,000 నుండి 1 మిలియన్ వరకు జరిమానాలు. ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రెండింటిలో ఒకటి విధించబడుతుంది.

- గృహ కార్మికుడిని పనికి చేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో తప్పుడు సమాచారం లేదా పత్రాలను సమర్పించిన వారిపై ఆరు నెలల జైలు శిక్ష, కనీసం Dh20,000, Dh100,000 వరకు జరిమానా లేదా ఈ రెండింటిని విధించబడుతుంది. చట్టాన్ని అమలు చేయకుండా న్యాయ అధికారిని అడ్డుకోవడం లేదా నిరోధించడం కూడా ఉల్లంఘన కిందకు వస్తుంది.

- చట్టంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించిన గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై Dh50,000 నుండి Dh200,000 వరకు జరిమానా విధిస్తారు. వర్క్ పర్మిట్ పొందకుండా, గృహ కార్మికులకు ఉపాధి కల్పించడం, గృహ కార్మికుడిని నియమించడం లేదా రిక్రూట్ చేయడం, అతనికి/ఆమెకు ఉపాధి కల్పించడంలో విఫలమైనందుకు, గృహ కార్మికులకు వర్క్ పర్మిట్‌లను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఎవరికైనా ఇలాంటి జరిమానా విధించబడుతుంది. ముఖ్యంగా దోషులుగా తేలిన ఏడాదిలోపు ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే జరిమానాలు రెట్టింపు చేయబడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com