ధోఫర్‌లో ఫిషింగ్ నిబంధనల ఉల్లంఘన.. ఆరుగురు అరెస్ట్
- December 20, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లో ఫిషింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ లాబ్‌స్టర్, చేపలు పట్టినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిషరీస్ అండ్ వాటర్ రిసోర్సెస్‌లోని మత్స్య నియంత్రణ బృందం విలాయత్‌లో ఫిషింగ్ బోట్లో నిబంధనలకు విరుద్ధంగా ఫిషింగ్ చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిందని తెలిపింది. ఒమన్‌లో లాబ్‌స్టర్ ఫిషింగ్ సీజన్ ప్రతి సంవత్సరం మార్చి 1 నుండి మే 31 వరకు ప్రారంభమవుతుంది. నిషేధ కాలంలో చేపలు పట్టడం, లాబ్‌స్టర్ లను కలిగి ఉండటం వంటి ఉల్లంఘనలకు చట్టం RO300 నుండి RO5,000 వరకు జరిమానాతో శిక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







