భారతదేశ విమానాశ్రయాలలో ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు
- December 22, 2022
యూఏఈ: చైనా, కొన్ని ఇతర దేశాలలో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణీకులకు ర్యాండమ్ కొవిడ్ పరీక్షను భారతదేశం తిరిగి ప్రవేశపెట్టింది. దేశంలోని కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత ఈ చర్య తీసుకున్నారు. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BF.7 కారణంగా చైనాలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఇప్పటివరకు ఈ వేరియంట్ కు సంబంధించిన మూడు కేసులు నమోదు అయ్యాయి.
భారతదేశంలోని అర్హులైన జనాభాలో కేవలం 27-28 శాతం మంది మాత్రమే కొవిడ్-19 ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రజలు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్ సూచించారు. ఈ క్రమంలో చైనా సహా వివిధ దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు చేపట్టినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







