క్షమాపణలు తెలిపిన డైరెక్టర్‌ త్రినాథ్‌ రావు

- December 22, 2022 , by Maagulf
క్షమాపణలు తెలిపిన డైరెక్టర్‌ త్రినాథ్‌ రావు

హైదరాబాద్: ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సగర ఉప్పర సంఘం వారికీ క్షమాపణలు తెలిపారు. 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాతో డైరెక్టర్ గా పరిచమైన ఈయన..ఆ తర్వాత నేను లోకల్ , సినిమా చూపిస్తా మావ , హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన రవితేజ తో ధమాకా మూవీ ని చేసాడు. ఈ నెల 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర ప్రమోషన్ లలో బిజీ గా ఉన్న త్రినాథరావుకు నిరసన సెగ ఎదురైంది.

ధమాకా చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ చిత్ర ద‌ర్శకుడు త్రినాథరావు నక్కిన త‌మ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచే విధంగా మాట్లాడార‌ని, ఇలాంటి వారిని స‌హించ‌బోమ‌ని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖ‌ర్ స‌గ‌ర వెల్లడించారు. బుధువారం హైద‌రాబాద్ ఫిలిం చాంబ‌ర్ వద్ద నాయ‌కులు ఆందోళ‌న చేపట్టి ..దిష్టి బొమ్మలను ద‌గ్ధం చేశారు.ఈ క్రమంలో గురువారం చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్‌ త్రినాథ్‌ రావు.. ఆ పదం తెలిసి వాడింది కాదన్నారు. తాను కూడా బీసీననే… ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తనపై కోపాన్ని సినిమాపై చూపెట్టవద్దని, ‘ధమాకా’ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. చిత్ర బృందం, తన తరపున మరోసారి క్షమాపణలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com