బాలయ్య జోరు మామూలుగా లేదుగా.!
- December 22, 2022
నందమూరి నటసింహం బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వీర సింహారెడ్డి’ సినిమా ఒక్క సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్‌కి సంబంధించి అప్డేట్ రిలీజ్ చేశారు.
చంద్రికా రవితో కలిసి ఈ స్పెషల్ సాంగ్‌లో బాలయ్య స్టెప్పులేయనున్నారు. పక్కా మాస్ మసాలా సాంగ్‌గా రూపొందిన ఈ సాంగ్ లిరికల్ ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌పై బాలయ్య లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ‘జై బాలయ్య..’ ‘సుగుణ సుందరి..’ పాటల లిరికల్ వీడియోలు దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక, ‘మా బావ మనోభావాల్..’ అంటూ సాగే ఈ స్పెషల్ లిరికల్ సాంగ్ ఎలా వుండోబోతోందో చూడాలి మరి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







