నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్..

- December 22, 2022 , by Maagulf
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్..

ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది (2023) నుంచి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్‌ ను మీ స్నేహితులు, సహోద్యోగులతో షేర్ చేయలేరు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని అడ్డుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు అతి త్వరలో రియాలిటీ కాబోతోంది. వచ్చే ఏడాది నుంచి నెట్‌ఫ్లిక్స్ తమ యూజర్లు ఇంటి వెలుపలి యూజర్లకు పాస్‌వర్డ్‌లను షేర్ చేయడానికి అనుమతించదు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. 2023 ఏడాది ప్రారంభం నుంచి నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను స్నేహితులతో లేదా ఇతరులు ఎవరితోనూ షేర్ చేయలేరని గుర్తించుకోవాలి.

నెట్‌ఫ్లిక్స్ చాలాకాలంగా పాస్‌వర్డ్ షేరింగ్ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లను ప్రారంభించినప్పటి నుంచి పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యగా మారింది. అయితే సబ్‌‌స్క్రైబర్లను కోల్పోయే వరకు కంపెనీ దానిని పరిష్కరించలేదు.

నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 2022 ప్రారంభంలో పడిపోయిన తర్వాత పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయాల్సిన అవసరాన్ని కంపెనీ గ్రహించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ 10ఏళ్లలో మొదటిసారిగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఈ ఏడాది ప్రారంభంలో, నెట్‌ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ మాట్లాడుతూ.. చాలా కాలంగా పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com