5 మిలియన్లకు చేరువైన ఒమన్ జనాభా
- December 23, 2022
మస్కట్: నవంబర్ 2022 చివరి వరకు 2 మిలియన్ల ప్రవాసులతో సహా ఒమన్ సుల్తానేట్ జనాభా సుమారు 5 మిలియన్లకు చేరుకుంది. ఒమన్ సుల్తానేట్ జనాభా గత నవంబర్ చివరి నాటికి 4,904,047కి చేరుకోగా.. గత అక్టోబర్‌లో జనాభా 4,876,125గా ఉన్నది. కేవలం ఒక నెలలోనే జనాభా 27,922 పెరిగడం గమనార్హం. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమానీల సంఖ్య 2,861,417కి చేరుకుంది. గత అక్టోబర్‌లో వారి సంఖ్య 2,856,777. నెలలో 4,640 మంది పెరిగారు. గణాంకాల ప్రకారం, గత నవంబర్ చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో ప్రవాసుల సంఖ్య 2,042,630కి చేరుకుంది. గత అక్టోబర్‌లో వారి సంఖ్య 2,019,348గా ఉన్నది. నెల వ్యవధిలో ఇది 23,282 పెరిగింది. జనసాంద్రత పరంగా మస్కట్ గవర్నరేట్ 1,463,218 మందితో మొదటి స్థానంలో ఉంది. అల్ వుస్తా గవర్నరేట్ 58,519 మందితో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ అన్ని గవర్నరేట్‌లలో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







