'బాహుబలి-2'కి సమ్మర్ ఎఫెక్ట్ తీవ్రంగా సోకింది..

- April 27, 2016 , by Maagulf
'బాహుబలి-2'కి సమ్మర్ ఎఫెక్ట్ తీవ్రంగా సోకింది..

'బాహుబలి-2'కి సమ్మర్ ఎఫెక్ట్ తీవ్రంగా సోకింది. మండే ఎండల కారణంగా ఈ జక్కన్న మూవీ షూటింగ్‌కు సుమారు నెలరోజులపాటు బ్రేక్ ఇవ్వాలని ఇటీవలే మేకర్స్ నిర్ణయించారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ బ్రేక్‌ను మొత్తం 45 రోజులకు పెంచినట్టు తెలుస్తోంది. మే నెల 1 నుంచి జూన్ 15 వరకు యూనిట్ షూటింగ్ నిలిపివేస్తుందని దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్‌ను.. పరిమితంగా.. కొంతమంది ఆర్టిస్టులతో కంటిన్యూ చేస్తున్నారట. ఇది ఈ నెలాఖరువరకు జరుగుతుంది. ప్రభాస్, అనుష్క మరికొంతమంది మాత్రం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బ్రేక్ ఇచ్చిన సమయంలో జక్కన్న తన ఫ్యామిలీతో ఆస్ట్రేలియా వెళ్తాడని, హీరో ప్రభాస్ యూఎస్‌కు, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కూడా ఫారిన్ ట్రిప్ పెట్టుకున్నారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌కు టెంపరేచర్ చేరుకోవడంతో ఇక 'బాహుబలి-2' యూనిట్‌కు రెస్ట్ ఇవ్వక తప్పింది కాదు. ఏది ఏమైనా 2017 ఏప్రిల్ 14న మూవీ రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి మేకర్స్ కట్టుబడి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com