రేపు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
- December 25, 2022
హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు ద్రౌపది ముర్ము నగరంలోనే బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. నిలయంలోపల ఉన్న ఆరు భవనాలను, దీని బయట ఉన్న మరో 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఉద్యానవనాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతంలో రోడ్లను మెరుగుపర్చడంతోపాటు, మంచి నీటి వసతి కల్పించారు. పాములు వంటి హానికర జీవులు రాష్ట్రపతి నిలయం, ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక బృందం ఇక్కడికి వచ్చింది. రాష్ట్రపతి భద్రతసహా ఇతర ఏర్పాట్లను పరిశీలించింది. ప్రత్యేక బలగాలు ఈ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. బొల్లారం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో గట్టి భద్రత కొనసాగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







