నూతన సంవత్సర వేడుకలు.. విమానాశ్రయాల్లో రద్దీ
- December 27, 2022
కువైట్: న్యూ ఇయర్ సెలవులకు సన్నాహకంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల సంఖ్య పెరగనున్నది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సర్వీసుల సంఖ్యలను పెంచినట్లు కువైట్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమానయాన గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 29 నుండి జనవరి 1 వరకు 1,284 విమాన సర్వీసుల ద్వారా సుమారు 139,000 మంది ప్రయాణించనున్నారు. దుబాయ్, కైరో, ఇస్తాంబుల్, జెద్దాలకు అత్యధికంగా బుకింగ్స్ జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. 642 విమాన సర్వీసుల ద్వారా 78,000 మంది ప్రయాణీకులు వెళతారని, అదే సమయంలో 642 విమాన సర్వీసులలో 61,000 మంది ప్రయాణీకులు కువైట్ వస్తారని విమానాశ్రయాల అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







