రెసిడెన్సీ చట్టాల అమలుపై 'లేబర్ అథారిటీ’ తనిఖీలు
- December 27, 2022
మనామా: బహ్రెయిన్ రాజధానితోపాటు ఉత్తర, దక్షిణ గవర్నరేట్లలో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీ ప్రచారాలను నిర్వహించింది. జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు (NPRA), అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్, గవర్నరేట్ల సంబంధిత పోలీసు డైరెక్టరేట్లతో సమన్వయంతో ఈ తనిఖీలు జరిగాయి. క్లాంప్డౌన్ ఫలితంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు అథారిటీ వెల్లడించింది. తనిఖీల సందర్భంగా కేసులను చట్టపరమైన చర్యల కోసం రిఫర్ చేసినట్లు పేర్కొంది. అధికారిక వెబ్సైట్లోhttp://www.lmra.bh ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా 17506055కు కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను నివేదించాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







