ప్రసూతి విభాగంలో డాక్టర్ కావ్య ప్రియా వజ్రాలకు అవార్డు

- December 27, 2022 , by Maagulf
ప్రసూతి విభాగంలో డాక్టర్ కావ్య ప్రియా వజ్రాలకు అవార్డు

హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన టైమ్స్ హెల్త్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని పార్క హయత్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఆస్పత్రులు, మెడికల్ ఇన్ స్టిట్యూట్లు, క్లినికల్స్, డయోగ్నోస్టిక్ సెంటర్లు తదితర వైద్య రంగానికి చెందిన విభాగాల్లో విశేష సేవలు, కృషి చేసిన వైద్యులు, సంస్థలను ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు. ఈ సంవత్సరం వివిధ విభాగాల్లో మొత్తం 56 మంది వైద్యులకు అవార్డులు అందజేశారు.

తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సునిల్ శెట్టి, హ్యూమాఖురేషీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన వైద్యులకు వీరు అవార్డులను అందజేశారు.

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ కావ్య ప్రియా వజ్రాల టైమ్స్ హెల్త్ కేర్ అవార్డ్స్ 2022 కు ఎంపికయ్యారు. కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ ఫెర్టిలిటీ స్పెషాలిస్ట్, కాస్మటిక్ గైనకాలజీ స్పెషాలిస్ట్ నిపుణురాలైన డాక్టర్ కావ్య ప్రియా వజ్రాలకు.. ఆయా రంగాల్లో అందించిన విశేష సేవలను పురస్కరించుకొని ‘బెస్ట్ ఎమర్జింగ్ ప్రసూతి & గైనకాలజిస్ట్’ విభాగంలో అవార్డును అందజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com