ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసులది కీలకపాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- December 27, 2022
హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫస్ట్ టైం లో తెలంగాణ లో అడుగుపెట్టింది. వారం రోజులపాటు ఇక్కడే గడపనున్నారు. మూడేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ కు రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్ లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి ఆలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామం అనంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రావడం జరిగింది.
ఈ సందర్బంగా నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో కీలక విభాగం అని ఉద్ఘాటించారు. పోలీసులకు అప్రమత్తత, సున్నితత్వం, నిజాయతీ అవసరం అని తెలిపారు. పోలీసులు నిష్పాక్షికత, పారదర్శకత, ధైర్యం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. పోలీసులు… పేదలు, బలహీనవర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







