2022లో ప్రాణాలు కోల్పోయిన 10 మంది భారతీయ సినీ ప్రముఖులు

- December 28, 2022 , by Maagulf
2022లో ప్రాణాలు కోల్పోయిన 10 మంది భారతీయ సినీ ప్రముఖులు

2022లో భారతీయ వినోద పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మరణించిన కొంతమంది ప్రముఖుల గురించి చూద్దాం.

లతా మంగేష్కర్

‘నైటింగేల్‌’గా పేరొందిన లతా మంగేష్కర్‌ మృతి సంగీత రంగానికి పెద్ద లోటు. మల్టిపుల్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్స్‌తో మంగేష్కర్ ఫిబ్రవరి 6న 92 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె 28 రోజులపాటు న్యుమోనియా, కోవిడ్-19 అనంతర సమస్యలతో బాధపడ్డారు.

బప్పి లాహిరి

'బప్పీ డా'గా ముద్దుగా పిలిచే బప్పి లాహిరి అనేక చార్ట్‌బస్టర్‌లను రూపొందించారు. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా బెంగాలీ, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా అనేక సాంగ్స్ పాడారు. అతను 69 సంవత్సరాల వయస్సులో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో ఫిబ్రవరి 15 న ముంబైలో మరణించాడు.

కేకే

కేకే గా పిలుచుకునే ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్.. మే 31న సౌత్ కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొంటున్నప్పుడు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

రాజు శ్రీవాస్తవ

రాజు శ్రీవాస్తవ ఒక ప్రముఖ హాస్యనటుడు, నటుడు, రాజకీయ నాయకుడు. అతను సెప్టెంబర్ 21న AIIMSలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'లో ప్రేక్షకులను మెప్పించాడు. స్టేజ్, టెలివిజన్‌లో లైవ్ స్టాండ్-అప్ కామెడీలో పేరుగాంచాడు.

సిద్ధూ మూసేవాలా

2022 మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలాను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఆయన కారులో ఉండగా దాడి చేసిన వ్యక్తులు అతన్ని అడ్డుకుని 30కి పైగా రౌండ్ల కాల్పులు జరిపారు.

పండిట్ బిర్జు మహారాజ్

పండిట్ బిర్జు మహారాజ్ లక్నో 'కల్కా-బిందాదిన్' ఘరానాకు చెందిన ప్రముఖ కథక్ నృత్యకారుడు, స్వరకర్త, గాయకుడు. 83 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో జనవరి 17 న మరణించాడు.

తునీషా శర్మ

'ఫితూర్', 'బార్ బార్ దేఖో', 'కహానీ 2: దుర్గా రాణి సింగ్', 'దబాంగ్ 3' వంటి చిత్రాలలో నటించిన నటి తునీషా శర్మ డిసెంబర్ 24న టీవీ సీరియల్ సెట్స్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. కానీ ప్రియుడు షీజన్ ఖాన్‌తో ఆమె విడిపోవడమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

విక్రమ్ గోఖలే

ప్రముఖ రంగస్థల, సినీ నటుడు విక్రమ్ గోఖలే నవంబర్ 26న పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. అంతకుముందు కొంతకాలం లైఫ్ సపోర్టుతో చికిత్స తీసుకున్నారు.

తబస్సుమ్

ప్రముఖ నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత తబస్సుమ్ గోవిల్ నవంబర్‌లో మరణించారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమె వయసు 78.

సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ

'క్కుసుమ్,' 'వారిస్', 'సూర్యపుత్ర కర్ణ్' వంటి టెలివిజన్ సీరియల్స్‌లో తన పాత్రలకు బాగా పేరు తెచ్చుకున్న సిద్ధాంత్(46).. జిమ్‌లో వ్యాయామం చేస్తూ నవంబర్ 11న మరణించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com