పీఆర్‌ఎస్‌ఐ జాతీయ అవార్డులు 2022 గెలుచుకున్న హైదరాబాద్ మెట్రో రైల్
- December 28, 2022
హైదరాబాద్: ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్ & టీఎంఆర్‌హెచ్‌ఎల్) అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఆర్‌ఎస్‌ఐ నేషనల్ అవార్డులు–2022 వద్ద పబ్లిక్ రిలేషన్స్ ఇన్ యాక్షన్ విభాగంలో మొదటి స్థానంలో మరియు బెస్ట్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ (ఎక్సటర్నల్ పబ్లిక్స్) విభాగంలో ద్వితీయ స్ధానం అందుకుంది. ఈ అవార్డు ట్రోఫీలను మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ మంగుభాయ్ ఛాంగ్‌భాయ్ పటేల్ చేతుల మీదుగా ఎల్ & టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ కార్పోరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ శ్రీమతి అనిందిత సిన్హా అందుకున్నారు. డిసెంబర్ 25 నుంచి 27 వరకూ కౌస్తభౌ ఠాక్రే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, భోపాల్‌లో జరిగిన 44వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో అవార్డు గ్రహీతలు, అతిథుల సమక్షంలో ఈ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎల్ & టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ –సీఈఓ శ్రీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ పీఆర్‌ఎస్‌ఐ మరియు మా వినియోగదారులు మరియు వాటాదారుల కోసం అవిశ్రాంత ప్రయత్నాలను గుర్తించిన న్యాయనిర్ణేతలకు ధన్యవాదములు తెలుపుతున్నాము. ఈ రెండు అవార్డులు మా నిరంతర ప్రయత్నాలకు నిదర్శనంగా ఉంటాయి. హైదరాబాద్ మెట్రో రైల్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు తెలియజేయడంతో పాటుగా ఈ ప్రయాణంలో వారిని భాగస్వాములుగా చేరుస్తున్నాము. సేవలను గురించి తగిన సమాచారం వెల్లడించడంతో పాటుగా అత్యుత్తమ ప్రయాణ అవకాశాలకు సంబంధించి వివరాలనూ వెల్లడిస్తున్నాము. అలాగే వ్యక్తిగత అనుబంధాన్ని నిర్వహించడం, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తూనే మా బ్రాండ్ ప్రతిధ్వనించేలా చేయడం దీనిలో భాగంగా ఉన్నాయి’’ అని అన్నారు.
ఈ 44వ ఆల్ పబ్లిక్ రిలేషన్స్ సదస్సులో ‘నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో స్టోరీ టెల్లింగ్’ అనే అంశం పై అనిందిత సిన్హా మాట్లాడుతూ కమ్యూనికేషన్ రంగంలో స్టోరీ టెల్లింగ్ ఆవశ్యకత తదితర అంశాలను వెల్లడించారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







