వ్యక్తిని దోచుకున్న నలుగురికి 7 ఏళ్ల జైలు శిక్ష
- December 28, 2022
దుబాయ్: వ్యక్తిని కిడ్నాప్ చేసి 1.9 మిలియన్ దిర్హామ్‌లను దోచుకున్నందుకు నలుగురికి దుబాయ్ క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏడాది సెప్టెంబర్ లో డౌన్‌టౌన్ దుబాయ్‌లో జరిగింది. ఒక పెట్టుబడిదారుడు తన డ్రైవర్‌కి ఫోన్ చేసి గోల్డ్ సౌక్‌లో ఉన్న తన వర్క్‌ప్లేస్‌కి తీసుకెళ్లమని అడిగాడు. దారిలో వాహనంలో సమస్య ఉందని డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. అనంతరం డ్రైవర్ అతని అనుచరులు కలిసి సదరు పెట్టుబడిదారుడిని దోచుకున్నారు. దర్యాప్తు బృందం సాక్ష్యాలను సేకరించి డ్రైవర్, అతని ఇద్దరు సహచరులను గుర్తించి అరెస్టు చేశారు. నాల్గవ నిందితుడు పనిచేసే పొలంలో దాచిన 1.6 మిలియన్ దిర్హామ్ లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి ఏడేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు బహిష్కరణను విధించింది. దోచుకున్న మొత్తాన్ని ఉమ్మడిగా చెల్లించాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







