2036 ఒలింపిక్స్ కోసం ఇండియా బిడ్
- December 30, 2022
న్యూఢిల్లీ: 2036 ఒలింపిక్ క్రీడల కోసం భారత్ బిడ్ వేయనుంది. వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఆతిథ్య హక్కుల కోసం ఇండిమా లాబీయింగ్ చేస్తుందని ఆ దేశ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచ క్రీడా శక్తిగా స్థాపించడానికి పోటీ పడుతోందన్నారు.
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ - ఒలింపిక్ హోస్ట్ సిటీగా ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన దీనిని 2020లో ప్రారంభించారు. క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఇండియా పోటీపడటానికి ఇదే సరైన సమయం అని అన్నారు.
భారత ప్రభుత్వ పూర్తి మద్దతుతో వచ్చే సెప్టెంబర్‌లో ముంబైలో జరిగే IOC సమావేశంలో ఒలింపిక్ గేమ్స్‌ను అహ్మదాబాద్ లో నిర్వహించేందుకు రోడ్‌మ్యాప్‌ను అందజేస్తామని ఠాకూర్ చెప్పారు. IOC ఇప్పటికే పారిస్, లాస్ ఏంజెల్స్, బ్రిస్బేన్లకు తదుపరి మూడు సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్య హక్కులను అందించింది.
భారత్ బిడ్ విజయవంతమైతే జపాన్, దక్షిణ కొరియా, చైనా తర్వాత ఈ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న నాలుగో ఆసియా దేశంగా అవతరిస్తుంది. భారతదేశం గతంలో 2010లో కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పటికే ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఖతార్‌లతో సహా అనేక ఇతర దేశాలు ఒలింపిక్ నిర్వహణ హక్కుల కోసం పోటీపడనున్నట్లు ప్రకటించాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!