ముగిసిన మోదీ తల్లి హీరాబెన్‌ అంత్యక్రియలు..

- December 30, 2022 , by Maagulf
ముగిసిన మోదీ తల్లి హీరాబెన్‌ అంత్యక్రియలు..

గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో ముగిసాయి. ఎంతో సింపుల్‌గా అంతిమయాత్ర నిర్వహించారు. తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అంతకుతముందు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పార్థివదేహన్ని యుఎన్‌ మెహతా ఆస్పత్రి నుంచి నేరుగా గాంధీనగర్‌లోని రైసన్ గ్రామంలోని బృందావన్ సొసైటీలో ఉంటున్న కుమారుడు పంకజ్ మోదీ ఇంటికి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని నేరుగా సోదరుడు పంకజ్ మోదీ ఇంటికి చేరుకుని తన తల్లికి నివాళులర్పించారు. కుమారులు, ముఖ్యమైన కుటుంబసభ్యులు సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం వాహనంలో గాంధీనగర్‌లోని సెక్టార్ 30 శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పాడెను ప్రధాని మోదీ మోసారు. ఆ తర్వాత వాహనంలో పార్థివదేహంతో పాటు ప్రధాని మోదీ శ్మశానవాటికకు చేరుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా సాధారణంగా అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియలకు తమ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారని, ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వారి రాకకు అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com