యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- December 30, 2022
తెలంగాణ: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా శుక్రవారం(డిసెంబర్30,2022)ఉదయం యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్టను సందర్శించిన 5వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.
రాష్ట్రపతి ముర్ముకు మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భ గుడిలో స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. రాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు లక్ష్మీనరసింహస్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ద్రౌపది ముర్ముకు అందించారు. అనంతరం యాదాద్రి ప్రధాన ఆలయ పరిసరాలను ఆమె పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!