నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన బహ్రెయిన్
- December 31, 2022
బహ్రెయిన్: డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయని బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) వెల్లడించింది. అవెన్యూస్ పార్క్, మరాస్సీ బీచ్, BBK ద్వారా వాటర్ గార్డెన్ సిటీ, GFH ద్వారా హార్బర్ రో లలో వివిధ ప్రదర్శనలు, వినోదాత్మక కార్యక్రమాలతో కూడిన ప్రయాణం, బాణాసంచా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుండి అవెన్యూస్ పార్క్‌లో 2023 అర్ధరాత్రి వరకు కౌంట్‌డౌన్‌ను చేపట్టునున్నట్లు తెలిపింది. దావాస్ సాంప్రదాయ బ్యాండ్, మజాజ్ బ్యాండ్, డస్టిజం DJ, DJ కాజ్‌ల ప్రత్యక్ష ప్రదర్శనలతో ఫైర్ డ్యాన్సర్లు, LEC డాన్సర్లు, ఇసుక ఆర్ట్ షో, బాణాసంచా ప్రదర్శన వంటి అనేక అద్భుతమైన వినోద కార్యక్రమాలను నిర్వహించడానికి మరాస్సీ బీచ్ సిద్ధంగా ఉందని పేర్కొంది.
బోహేమియన్ నైట్స్ విత్ DJలు, లైవ్ మ్యూజిక్, డ్రమ్మింగ్ సర్కిల్, హ్యాండ్ ప్యాన్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లు, బాణసంచా ప్రదర్శన, యోగాతో కూడిన మరో అద్భుతమైన వినోదాత్మక ఈవెంట్లు వాటర్ గార్డెన్ సిటీలో పరిచయం చేయబడతాయని తెలిపింది. హార్బర్ రోలో అద్భుతమైన బాణసంచా ప్రదర్శనతో 2023ని ప్రారంభించడం కూడా ప్రత్యేకంగా ఉంటుందని BTEA CEO డాక్టర్ నాసర్ ఖైదీ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







