'బ్రహ్మోత్సవం' ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్ విడుదల..

- April 27, 2016 , by Maagulf
'బ్రహ్మోత్సవం' ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్ విడుదల..

ప్రిన్స్' మహేశ్ బాబు తన అభిమానులకు మరో కానుక ఇచ్చారు. తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు ఆనందం పంచారు. తన ట్విటర్ పేజీలో దీన్ని పోస్ట్ చేశారు. డిఫరెంట్ గా డెకరేట్ చేసిన మూడు చక్రాల వైరటీ బుల్లెట్ పై 'ప్రిన్స్' స్టైల్ గా దూసుకుపోతున్నట్టుగా మోషన్ పోస్టర్ లో చూపించారు.ఉగాదికి విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానుల్లో అమితాసక్తి రేపింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న విడుదల చేసి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. 'బ్రహ్మోత్సవం' ఆడియో మే 7న విడుదల చేయనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com