‘ఏజెంట్’ యాక్షన్ మామూలుగా వుండదు.! ఫ్రూఫ్ ఇదిగో.!
- January 02, 2023
అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఇదో స్పై యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. యాక్షన్ ఘట్టాలు అలా ఇలా వుండవన్నట్లుగా ఈ మేకింగ్ వీడియో ఆంబియెన్స్ ద్వారా చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు ‘ఏజెంట్’ టీమ్.
ఇక ఈ తాజా వీడియోలో అఖిల్ మ్యాకోమేన్ లుక్స్ ఫ్యాన్స్‌కి సరికొత్త ట్రీట్ ఇస్తున్నాయ్. బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ధీటుగా వుండే విధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా తాజా గ్లింప్స్ ప్రూవ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎలాగైనా ఈ సినిమాతో గట్టి హిట్టు కొట్టాలనుకుంటున్నాడు అఖిల్. అంతేకాదు, ప్యాన్ ఇండియా వైజ్ ఘనంగా ‘ఏజెంట్’ని రిలీజ్ చేసే ప్లానింగ్‌లో చిత్ర యూనిట్ వున్నట్లు తెలుస్తోంది.
అన్నట్లు ‘ఏజెంట్’ ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే, ఇది తాత్కాలిక రిలీజ్ డేట్ మాత్రమే. అధికారికంగా రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







