నిరుద్యోగ బీమా పథకం.. నమోదుకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్
- January 03, 2023యూఏఈ: నిరుద్యోగ బీమా పథకంలో నమోదుకు అర్హత ఉన్న యూఏఈలోని ఉద్యోగులకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌ని ఖరారు చేశారు. నోటిఫికేషన్ ప్రకారం గ్రేస్ పీరియడ్ 2023 జూన్ 30తో ముగుస్తుంది. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ రంగ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్న ఎమిరాటీలు, ప్రవాసుల కోసం 2023 జనవరి 1న ఈ పథకంలో నమోదు ప్రారంభమైంది. అలాగే, బీమా చేసిన వ్యక్తి/కార్మికుడు జనవరి 1 తర్వాత తేదీలో ఉద్యోగంలో చేరినట్లయితే, నిరుద్యోగ బీమా పథకంలో సభ్యత్వం పొందడానికి నాలుగు నెలల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఉద్యోగులు 2023 జూన్ 30 లోపు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. లేని పక్షంలో Dh400 జరిమానా విధించబడుతుంది. మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నేతృత్వంలోని బీమా పథకంలో అతి తక్కువ నెలవారీ ప్రీమియంలు Dh 5 నుండి Dh10 వరకు అందుబాటులో ఉన్నాయి. బీమా చేసిన వ్యక్తి ఉద్యోగం కోల్పోయినట్లయితే మూడు నెలల పాటు వారి ప్రాథమిక వేతనాలలో 60 శాతం మొత్తాన్ని పొందుతారు. కాగా, క్రమశిక్షణా చర్య లేదా రాజీనామా తో ఉద్యోగం కోల్పోయిన వారు ఈ పథకానికి అనర్హులు. నగదు పరిహారానికి అర్హత పొందేందుకు బీమా చేసిన వ్యక్తి కనీసం 12 వరుస నెలల పాటు తప్పనిసరిగా సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ