ఎన్నాళ్లకెన్నాళ్లకు స్వీటీ యాక్టివిటీ.!
- January 07, 2023
స్వీటీ.. ఆ పేరు వింటేనే అదో కిక్కు. హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది స్వీటీ అనుష్క. ఈ జనరేషన్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు స్వీటీ పెట్టింది పేరు.
అలాంటిది గత కొన్నాళ్లుగా స్వీటీ సినిమాలకు దూరంగా వుంటోంది. ‘నిశ్శబ్ధం’ సినిమా తర్వాత అనుష్క నుంచి సినిమా రాలేదు. నవీన్ పోలిశెట్టితో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయ్యింది. కానీ, దాని స్టేటస్ ఇంతవరకూ తెలీదు.
మొన్నా మధ్య ఆ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారంతే. ఛెఫ్‌గా అనుష్క పాత్రను పరిచయం చేశారు ఆ పోస్టర్ ద్వారా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే వుందని మాత్రం తెలుస్తోంది.
తాజాగా ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమా ట్రైలర్‌ని లాంఛ్ చేసింది అనుష్క. అలా అనుష్క పేరు చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ శోభన్ హీరోగా నటించాడు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







