అల్ లాజీ సరస్సును పరిశీలించిన అల్ అస్ఫూర్
- January 08, 2023
బహ్రెయిన్: రాజ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదల నియంత్రణ చర్యలను ఉత్తర గవర్నర్ అలీ బిన్ షేక్ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫూర్ సమీక్షించారు. వరద నీటి తొలగింపునకు అధిక సామర్థ్యం గల పంపులను వ్యవస్థాపించి, వర్షపు నీటి పారుదల మార్గాలకు వాటిని కనెక్ట్ చేసినందుకు వర్క్స్ మంత్రిత్వ శాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అల్ లాజీ సరస్సు సామర్థ్యాన్ని పెంచడానికి, వర్షపు నీటి కాలువలు, కాలువల విస్తరణ కోసం చేపట్టిన పనుల పురోగతిని అల్ అస్ఫూర్ పరిశీలించారు. ఉత్తర గవర్నర్ హమద్ టౌన్‌లోని అల్ లాజీ ప్రాంతం, సరస్సును సందర్శించి వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల భద్రతను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతను నిర్ధారించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా జారీ చేసిన ఆదేశాలపై కూడా అధికారుతో సమీక్షించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







