బ్రెజిల్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు..

- January 09, 2023 , by Maagulf
బ్రెజిల్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు..

బ్రెజిల్: బ్రెజిల్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. నిరసనకారులు నేషనల్ కాంగ్రెస్ భవనంపై దాడి చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. బ్రెజిల్ లో 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం లులా డా సిల్వా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే, బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. రాజకీయ అంశంలో తమ దేశ సైన్యం జోక్యం చేసుకోవాలని, పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని వారు ఆరోపిస్తున్నారు. అధ్యక్ష భవనం వద్దకు వెళ్లి విధ్వంసానికి పాల్పడి బీభత్సం సృష్టించారు.

గతంలో అమెరికాలోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన తలపిస్తోంది. ఈ ఘటనను అధ్యక్షు లులా డా సిల్వా ఖండించారు. నిరసనకారులు చేసిన దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. బ్రెజిల్ లో పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్న ఆందోళనల పై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు.

‘‘బ్రసిలియాలోని ప్రభుత్వ వ్యవస్థలపై చేసిన దాడి గురించి తెలుసుకుని ఆందోళన చెందాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిల్ అధికారులకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. బ్రెజిల్ లో చోటుచేసుకున్న ఘటనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండించారు. అలాగే, ఇటువంటి దాడులు సరికాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com