అన్ని వూరుల్లో వైఫై సేవలు: ఏపీ సిఎం

- April 28, 2016 , by Maagulf
అన్ని వూరుల్లో వైఫై సేవలు: ఏపీ  సిఎం

విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లతో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఫైబర్‌ గ్రిడ్‌ పూర్తిచేసి ఊరంతా వైఫై తీసుకొస్తామని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు. ఉద్యోగ రథం, జాబ్స్ డైలాగ్‌ను గురువారం సీఎం ప్రారంభించారు. వీటితో పాటుగా దేశంలోనే మొదటి మొబైల్‌ బేస్డ్‌ నియామకసంస్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచిత సేవలు అందించనున్న ఉద్యోగ రథం, జాబ్స్‌ డైలాగ్‌ వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రతి జిల్లాకో ఉద్యోగ రథాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విభజన సమస్యలున్నా రాష్ట్రంలో వనరులకు కొరత లేదని, ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో ఏపీ మూడోస్థానంలో ఉందని ఆయన తెలిపారు. శ్రీసిటీతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com