ఒమన్ లో ఉద్యోగార్ధుల కోసం కొత్త యాప్
- January 09, 2023
మస్కట్: ఉద్యోగార్ధులు, జాతీయ శ్రామిక శక్తి, యజమానుల కోసం మాక్ లేదా ‘విత్ యూ’ యాప్‌ను కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) ప్రారంభించింది. ఇందులో ఉద్యోగార్ధుల కోసం 11 కంటే ఎక్కువ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలువురు మంత్రులు, గవర్నర్‌లతో ఆదివారం కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి విధానం, గవర్నరేట్‌లలో పెట్టుబడులు, వృత్తులను స్థానికీకరించే మార్గాలు, ఈ రంగాలలో గవర్నరేట్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్‌ఇ డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్ మాట్లాడుతూ.. 2022లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 35,000 ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో మొదటి సారిగా లేబర్ మార్కెట్‌లో చేరిన ఉద్యోగార్ధుల సంఖ్య గత ఏడాది 20,000 దాటిందని, 2021తో పోల్చితే 2022లో ఉద్యోగ భద్రత నిధి నుండి లబ్ది పొందుతున్న వారి సంఖ్య దాదాపు 3,000 పెరిగిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ 2022 చివరి నాటికి దేశంలో 85,000 మందికి పైగా ఉద్యోగార్ధులు ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!