యూఏఈ-అల్ సుహబ్ రహదారి మూసివేత
- January 09, 2023
యూఏఈ: యూఏఈ నుంచి ఖోర్‌ఫక్కన్‌లోని అల్ సుహబ్ రెస్ట్ ఏరియాకు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా పోలీసులు ప్రకటించారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విశ్రాంతి గృహానికి వచ్చిన సందర్శకులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు వరుస ట్వీట్ లలో ధృవీకరించారు. సందర్శకులను కిందకు తీసుకు వచ్చేందుకు వీలుగా రహదారిలో పడిఉన్న బండరాళ్ల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెస్ట్ స్టాప్ 2021లో ప్రజల కోసం ప్రారంభించారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..