6 గంటలపాటు శ్రమించి ప్రవాసుడి ప్రాణాలు కాపాడిన వైద్యులు

- January 09, 2023 , by Maagulf
6 గంటలపాటు శ్రమించి ప్రవాసుడి ప్రాణాలు కాపాడిన వైద్యులు

సౌదీ: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ప్రవాసుడి ప్రాణాలను వైద్యులు 6 గంటలపాటు శ్రమించి రక్షించారు. తైఫ్ గవర్నరేట్ లో జరిగిన కారు ప్రమాదంలో 50 ఏళ్ల ప్రవాస వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సహాయ బృందాలు గవర్నరేట్‌లోని అల్-ఖుర్మా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించాయి. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్యులు క్లినికల్, లాబొరేటరీ, రేడియోలాజికల్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో  పేగు, పురీషనాళంలో తీవ్రమైన చీలిక ఫలితంగా రోగి పొత్తికడుపులో అంతర్గతంగా రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంతర్గత రక్తస్రావాన్ని ఆపడానికి వైద్య బృందం 6 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత రోగిని డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గత సంవత్సరం 148 అత్యవసర ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు అల్-ఖుర్మా జనరల్ హాస్పిటల్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com