యూఎస్ కోర్టులో భారత సంతతి మహిళ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం
- January 09, 2023
అమెరికా: భారత సంతతి మహిళ అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆమె టెక్సాస్ లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దీంతో అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా తనకు దక్కిన అరుదైన గౌరవం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 1970లో మన్ ప్రీత్ తండ్రి అమెరికాకు వెలస వెళ్లారు. దీంతో ఆమె హ్యూస్టన్ లోనే పుట్టి పెరిగారు.
భర్త, ఇద్దరు పిల్లలతో ఆమె ఇప్పుడు బెల్లయిరేలో నివాసం ఉంటుంది. హ్యుస్టన్ లోనే ట్రయల్ న్యాయవాదిగా 20 ఏళ్లపాటు పని చేశారు. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసులను కూడా ఆమె వాదించడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







