లేబర్ మార్కెట్లో 37శాతానికి పెరిగిన మహిళల భాగస్వామ్యం
- January 10, 2023
రియాద్ : 2022లో లేబర్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం 37%కి పెరిగిందని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి (MHRSD) ఇంజినీర్ అహ్మద్ అల్-రాజీ చెప్పారు. సోషల్ డైలాగ్ ఫోరమ్ పన్నెండవ వెర్షన్లో అల్-రాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాముఖ్యత రంగాలలో పెట్టుబడి పెట్టడం, సవాళ్లను ఎదుర్కోవడం, అలాగే ఆకర్షణీయమైన లేబర్ మార్కెట్కు విశిష్టమైన పని వాతావరణాన్ని కల్పించడం, జాతీయ ఆర్థిక వ్యవస్థ, కార్మిక మార్కెట్ వ్యూహానికి మద్దతు ఇవ్వడంలో ఫోరమ్ దోహదపడుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 2.2 మిలియన్ల సౌదీలు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారని అల్-రాజీ పేర్కొన్నారు. 550,000 కంటే ఎక్కువ మంది సౌదీ పురుషులు, మహిళలు ఉపాధి పొందారని తెలిపారు. 98% సంస్థలు నిబద్ధతతో పనిచేస్తున్నాయని, 80% కంపెనీలు వేతన రక్షణకు కట్టుబడి ఉన్నాయన్నారు. 3.8 మిలియన్ల పని ఒప్పందాలు నమోదు కాగా.. కార్మిక వివాదాల సామరస్య పరిష్కారం రేటు 74% పెరిగిందని అల్-రాజీ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!