1000 మంది పర్యాటకులతో కువైట్ వచ్చిన క్రూయిజ్ షిప్
- January 10, 2023
కువైట్: సుమారు 1000 మంది యూరోపియన్ పర్యాటకులతో MS ARTANIA షిప్ షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకుంది. 2012 తరువాత ఓ క్రూయిజ్ షిప్ కువైట్ పోర్టుకు రావడం ఇదే తొలిసారి. కువైట్ టూరిజం ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ క్రూయిజ్ షిప్ కువైట్ చేరుకుందని కువైట్ పోర్ట్స్ కార్పొరేషన్ తెలిపింది. “న్యూ కువైట్ 2035” విజన్ ఫ్రేమ్‌వర్క్ కు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రొత్సహిస్తున్నట్లు పేర్కొంది. 231 మీటర్ల పొడవు, 9 అంతస్తుల ఎత్తు ఉన్న క్రూయిజ్ షిప్ "ఆర్టానియా"ను జర్మన్ కు చెందిన క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ఫీనిక్స్ రీసెన్ నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







