బహ్రెయిన్ లో కనీస జీతం పెరుగుతుందా?
- January 10, 2023
బహ్రెయిన్ : బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం.. బహ్రెయిన్ ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న 71% ప్రవాసులు నేడు నెలకు BD200 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. అయితే నివేదికల ప్రకారం.. చమురు ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.
మరోవైపు బహ్రెయిన్ లో కనీస వేతనాన్ని చివరిగా జనవరి 1, 2015న సవరించారు. ప్రవాసులలో అధిక భాగం మంది తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా జీవన వ్యయాలు అధికం అయ్యాయి. కానీ ప్రైవేట్ రంగ సంస్థల లాభాలు పెరుగుతున్నా ఆ మేరకు కార్మికులకు జీతాలు మాత్రం పెరగడం లేదు. బహ్రెయిన్‌లో ప్రవాస కార్మికులకు కనీస వేతన చట్టం లేదు. కార్మికులకు చెల్లించే కనీస వేతన రేటు విషయంలో స్పష్టత లేదు. అయితే, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రం BD300 రేటును నిర్ణయించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కనీస వేతన చట్టంలో మార్పులు జరిగే అవకాశం ఉందని లేబర్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







