1000 మంది పర్యాటకులతో కువైట్ వచ్చిన క్రూయిజ్ షిప్

- January 10, 2023 , by Maagulf
1000 మంది పర్యాటకులతో కువైట్ వచ్చిన క్రూయిజ్ షిప్

కువైట్: సుమారు 1000 మంది యూరోపియన్ పర్యాటకులతో MS ARTANIA షిప్  షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకుంది. 2012 తరువాత ఓ క్రూయిజ్ షిప్ కువైట్ పోర్టుకు రావడం ఇదే తొలిసారి. కువైట్ టూరిజం ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ క్రూయిజ్ షిప్ కువైట్ చేరుకుందని కువైట్ పోర్ట్స్ కార్పొరేషన్ తెలిపింది. “న్యూ కువైట్ 2035” విజన్ ఫ్రేమ్‌వర్క్‌ కు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రొత్సహిస్తున్నట్లు పేర్కొంది.  231 మీటర్ల పొడవు, 9 అంతస్తుల ఎత్తు ఉన్న క్రూయిజ్ షిప్ "ఆర్టానియా"ను జర్మన్ కు చెందిన  క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ఫీనిక్స్ రీసెన్ నిర్వహిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com