హజ్ యాత్రికులకు శుభవార్త.. మూడేళ్ల తర్వాత పరిమితి ఎత్తివేత
- January 10, 2023
సౌదీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మూడేళ్ల తర్వాత హజ్ యాత్రికుల సంఖ్యపై పరిమితులను సౌదీ ఎత్తివేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా రియాద్‌లో విలేకరులతో తెలిపారు. యాత్రికుల సంఖ్య, వయోపరిమితిపై పరిమితులు లేకుండా మహమ్మారికి ముందు ఉన్న స్థితికి చేరుకుందన్నారు. 2019 లో సుమారు 2.5 మిలియన్ల మంది హజ్ యాత్రలో పాల్గొన్నారు. మహమ్మారి కారణంగా తరువాతి రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్యను భారీగా తగ్గించారు. 2022లో దాదాపు 900,000 మంది యాత్రికులు హజ్ యాత్రను పూర్తి చేశారు. విదేశాల నుండి 780,000 మంది యాత్రికులు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను సందర్శించారు. కరోనా ఆంక్షల సమయంలో యాత్రికులు 65 ఏళ్లలోపు ఉండాలని, కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవడంతోపాటు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని షరతులు పెట్టారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!