ధైర్యంగా ఊరెళ్ళండి.. ఆనందంగా పండుగ జరుపుకోండి: సీపీ స్టీఫెన్ రవీంద్ర

- January 10, 2023 , by Maagulf
ధైర్యంగా ఊరెళ్ళండి.. ఆనందంగా పండుగ జరుపుకోండి: సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో, క్రైమ్స్ విభాగం అధికారులతో ఈరోజు  సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర సంక్రాంతి పండుగ దృష్ట్యా పోలీసులు చెప్పటాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులుండటంతో చాలా మంది ప్రజలు వారి సొంత ఊళ్లకు ప్రయాణాలు చేస్తుంటారన్నారు. అయితే ఇదే అదనుగా స్థానిక, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చేతివాటం ప్రదర్శిస్తుంటారన్నారు. 

రాత్రి వేళల్లో జరిగే చోరిల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని ప్రజలు ధైర్యంగా ఊరెళ్లి, సంతోషంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.రాత్రి సమయంలో నివాస ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచి,రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో HB/డే & HB/నైట్, ఆటోమొబైల్  దొంగతనలు జరగకుండా క్రైమ్స్ హాట్ స్పాట్ లలో CCTV లను ఏర్పాటు చేసి నిరంతరం ప్రత్యేక నిఘా పెట్టి, PSIOC ద్వారా మనీటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు అందేలా చేస్తున్నామన్నారు.పౌరులు తమ ప్రాంగణంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోనేలా, కాలనీలలో అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారాన్ని తెలియజేసేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు.

పాత నేరస్థులు మరియు ఇటీవల జైలు నుండి విడుదలైన వారి కార్యకలాపాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, అనుమానితులను పట్టుకోవడానికి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తు నేర నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.కమీషనరేట్ పరిధి సరిహద్దు ప్రాంతాల పోలీసు స్టేషన్ వారు సరిహదు పోలీసు స్టేషన్ల వారితో సమన్వయం చేసుకుంటూ పెట్రోలింగ్, రైల్వే పోలీసులతో కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి వాహనాలను నడుపుకోవాలన్నారు.

ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, బాలానగర్ డీసీపీ సందీప్, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, ఏడీసీపీ క్రైమ్స్ నరసింహా రెడ్డి, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com