నేటి నుంచే ఒమన్ డి20 లీగ్
- January 11, 2023
మస్కట్: ఒమన్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒమన్ D20 లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఒమన్ క్రికెట్ లీగ్ 24 జనవరి 2023 వరకు తన రెండవ ఎడిషన్ జరుగనున్నది. అన్ని మ్యాచ్‌లు ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్‌లోని టర్ఫ్ 1లో రౌండ్-రాబిన్ ఫార్మాట్లో నిర్వహించబడతాయి. డబుల్ హెడర్ మ్యాచ్‌లు వారాంతపు రోజులలో మధ్యాహ్నం 2:30, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతాయి. ట్రిపుల్ హెడర్ మ్యాచ్‌లు వారాంతాల్లో వరుసగా ఉదయం 10:30, 2:30, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతాయి. D20 టోర్నమెంట్లో ఖురమ్ థండర్స్, అమెరట్ రాయల్స్, అజైబా XI, బౌషర్ బస్టర్స్, ఖువైర్ వారియర్స్, ఘుబ్రాహ్ జెయింట్స్, దర్సైత్ టైటాన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ - రువీ రేంజర్స్ పాల్గొంటున్నాయని ఒమన్ క్రికెట్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దులీప్ మెండిస్ తెలిపారు. ఒమన్ D20 లీగ్‌ను భారతదేశంలోని ఫ్యాన్‌కోడ్, పాకిస్తాన్‌లోని జియోస్పోర్ట్స్, యుఎస్, కెనడాలోని విల్లో టీవీ, మిడిల్ ఈస్ట్‌లోని క్రిక్లైఫ్2, స్విచ్ టీవీ లు ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







