బస్ ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన TSRTC
- January 13, 2023
హైదరాబాద్: సంక్రాంతి వేళా TSRTC ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. బస్ ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది TSRTC.ఈ యాప్ ద్వారా మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడ ఉంది? ఎంతసేపటికి మీరు బస్సు ఎక్కాల్సిన ప్రాంతానికి రానుంది? అనే వివరాలను తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ ద్వారా మీ బస్సు ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ చెప్పుకొచ్చింది.
గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి నేరుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా http://www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సర్వీస్ నెంబర్ లేదా వెహికల్ నెంబర్ లేదా బస్టాఫ్ వివరాలను ఎంటర్ చేసి మీ బస్సు లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. యాప్‌లో ప్రయాణికుల పర్సనల్ వివరాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. అలాగే ఈ యాప్ ద్వారా రోడ్డు ప్రమాదం, వైద్య సహాయం, బస్సు బ్రేక్ డౌన్ వంటి వివరాలను అధికారులకు తెలుపవచ్చు.
దీని ద్వారా అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పాటు బస్సు బుక్ చేసుకున్న తర్వాత టికెట్ వివరాలతో పాటు మొబైల్‌కు ఒక లింక్ వస్తుంది. దీని ద్వారా కూడా బస్సు లొకేషన్ వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







