రామ్ చరణ్ స్టోరీని రౌడీ ఓకే చేశాడు.!
- January 14, 2023
‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సి వుంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని ఇటీవల రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘జెర్సీ’తో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్‌తో రామ్ చరణ్ సినిమా చేయాలని చాలా ఉత్సాహ పడ్డాడు. కానీ, కుదరలేదు. భవిష్యత్తులో ఎప్పటికైనా గౌతమ్ తిన్ననూరితో కలిసి పని చేస్తానని రామ్ చరణ్ మాటిచ్చాడు.
ఆ సంగతి అటుంచితే, తాజాగా గౌతమ్ తిన్ననూరి లిస్టులోకి కామ్‌గా రౌడీ ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి సినిమా ఓకే అయ్యింది. రామ్ చరణ్‌తో తెరకెక్కించాల్సిన స్టోరీతోనే రౌడీని డైరెక్ట్ చేస్తున్నాడు గౌతమ్ అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసి సినిమాని అధికారికంగా కన్ఫామ్ చేశారు. పోలీస్ గెటప్‌లో ముఖం కవర్ చేసి వున్న ప్రీ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోందనీ తెలుస్తోంది. ప్రస్తుతం రౌడీ చేయాల్సిన ‘ఖుషీ’ సినిమా సమంత అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







