హిజ్ మెజెస్టి యాక్సెషన్ డే.. అంబరాన్నంటిన సంబరాలు

- January 14, 2023 , by Maagulf
హిజ్ మెజెస్టి యాక్సెషన్ డే.. అంబరాన్నంటిన సంబరాలు

సుహార్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారంలోకి వచ్చిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒమన్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సుహార్ విలాయత్ ప్రజలు సందడిగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌, మజ్లిస్‌ అష్‌షూరా సభ్యులు, ప్రభుత్వ సంస్థల డైరెక్టర్లు, షేక్‌లు, గవర్నరేట్‌లోని ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో దేశభక్తి, జానపద పాటలు, ఒంటెల ప్రదర్శనలు, గుర్రపు కవాతులు సందడి చేశాయి. వీటితోపాటు సముద్ర కళా బృందాలు, అనేక ఓడలు మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, ఒమన్ సుల్తానేట్ జెండాలను ప్రదర్శించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com