ఫిబ్రవరి 1న ఆకాశంలో కనువిందు చేయనున్న ‘ఆకుపచ్చ తోకచుక్క’
- January 15, 2023
యూఏఈ: 50 సంవత్సరాలకు ఒకసారి కనిపించే అరుదైన ఆకుపచ్చ తోకచుక్క (కామెట్ 2022 E3 (ZTF)) మరోసారి వినువీధిలో కనువిందు చేయనుంది. ఫిబ్రవరి 1, 2023న దాదాపు 26 మిలియన్ మైళ్ల దూరంలో భూమికి దగ్గరగా వెళుతుందని, ఆ సమయంలో యూఏఈ నివాసితులు దాన్ని చూడవచ్చని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. పిభ్రవరి 5వ తేదీ వరకు ఆకుపచ్చ తోకచుక్కని ఆకాశంలో చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఇది కంటితో చూడగలిగేంత ప్రకాశవంతం కాకపోయినా బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోప్‌లతో వీక్షించవచ్చని ఆయన చెప్పారు. దుబాయ్ ఖగోళ శాస్త్ర గ్రూప్ ఫిబ్రవరి 4, 2023న దుబాయ్‌లోని అల్ ఖుద్రా ఎడారిలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 వరకు ప్రత్యేక టిక్కెట్ ఈవెంట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఇందులో కామెట్, మూన్, మార్స్, జూపిటర్ మరియు డీప్ స్కై ఆబ్జెక్ట్స్ టెలిస్కోప్ పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ సెషన్లు, స్కై మ్యాపింగ్ ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







