స్నాప్‌చాట్ లో లగ్జరీ వాచ్ ప్రకటన.. 80,000 దిర్హామ్‌లు మోసం
- January 15, 2023
యూఏఈ: స్నాప్ చాట్ లో లగ్జరీ వాచ్ అమ్మకం పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. 80,000 దిర్హామ్‌లకు లగ్జరీ వాచ్ ను అమ్ముతానని ఓ వ్యక్తి తనను మోసం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిందితుడికి సూచించింది. అబుధాబి అప్పీల్స్ కోర్టు సివిల్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. స్నాప్‌చాట్ ద్వారా ఒప్పందం కుదిరిందని, 80,000 దిర్హామ్‌లకు వాచ్‌ని కొనుగోలు చేసేందుకు వీలుగా నిందితుడి బ్యాంక్ ఖాతాకు మొత్తాన్ని బదిలీ చేశానని, ఆ తర్వాత వాచ్ ఇవ్వకుండా నిందితుడు తనన మోసం చేసినట్లు బాధితుడు కోర్టు పత్రాల్లో పేర్కొన్నాడు. అలాగే తనకు జరిగిన మానసిక వేధనకు 20,000 దిర్హామ్‌లను పరిహారంగా చెల్లించాలని కోర్టుకు విన్నవించాడు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు.. సివిల్ అప్పీల్ కోర్టు న్యాయమూర్తి మొదటి కోర్టు ఇచ్చిన మునుపటి తీర్పును సమర్థించారు. ఫిర్యాదుదారు నుండి తీసుకున్న Dh80,000 తిరిగి చెల్లించాలని ప్రతివాదిని ఆదేశించారు. మరో 5,000 దిర్హామ్‌లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వీటితోపాటు చట్టపరమైన ఖర్చులకు కూడా చెల్లించాలని నిందితుడిని ఆదేశించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







